రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బిజెపి పార్టీ తోనే సాధ్యం మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి.
(రవి కిరణాలు న్యూస్ చిట్టమూరు)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురందరేశ్వరి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా పోరు 2 కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిట్టమూరు మండలంలోని కొత్తగుంట, సోమసముద్రం ,మల్లం ,ఎల్లసిరి గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించరు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ పది సంవత్సరాల కాలంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేపట్టిన అనేక పథకాల గురించి ,సంస్కరణల గురించి, దేశ అభివృద్ధిని గురించి ప్రజలకు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి తెలియజేస్తూ అదే విధంగా కరపత్రాలను దుకాణదారులకు కార్యకర్తలకు ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి సీనియర్ నాయకులు వెంకటసుబ్బారెడ్డి, పార్థసారధి రెడ్డి, ఓ బి సి మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి యుగంధర్ రెడ్డి, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు ముని బాబు, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు పల్లం వెంకటయ్య ,ఎస్సీ మోర్చా జిల్లా సభ్యులు ఏంబేటి రమణయ్య తదితరులు పాల్గొన్నారు
Post a Comment