ఎంపీ దృష్టికి వరదయ్యపాలెం హరిజనవాడ వీధుల పరిస్థితి.
రవి కిరణాలు తిరుపతి జిల్లా వరదయ్య పాలెం:-
వరదయ్యపాలెం మేజర్ పంచాయతీలోని హరిజన వాడలో వర్షం పడినప్పుడు నడవడానికి కూడా వీలుకాని పరిస్థితి ఏర్పడుతుందని,స్థానికులు తిరుపతి ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా శంకుస్థాపన చేసినప్పటికీ,వీధి కాలువల నిర్మాణం చేపట్టలేదని,దానిపై దృష్టి పెట్టాలని ఎంపీ గురుమూర్తికి స్థానికులు కే రమేష్ , నరేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.వరదయ్యపాలెం నందు రెండు సచివాలయాలు ఉన్నాయని,అందుకు గడపగడపకు మన ప్రభుత్వం నిధులు 20, లక్షల, ఎంపీపీ నిధులు కొంత, ఎమ్మెల్యే నిధులు కొంత ఎంపీ నిధులతో కొంత మొత్తంగా సుమారు 70 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది, అయినప్పటికీ వీధి కాలవల నిర్మాణం భూమి పూజ వరకే నోచుకోవడం బాధాకరమని,తమ ఆవేదనను ఎంపీ కి తెలిపారు.తాను దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, తిరుపతి ఎంపీ గురుమూర్తి హామీ ఇచ్చారు.
Post a Comment