రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విజేతలకు శుభాకాంక్షలు... ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీల ముగింపు కార్యక్రమం
చిత్తూరు జిల్లా ను రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర లో ప్రథమ స్థానం లో నిలపండి...
: జే సి
చిత్తూరు,ఫిబ్రవరి 03: యువత లో క్రీడా స్ఫూర్తి ని పెంపొందించేందుకు మరియు క్రీడా ప్రతిభను రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల ద్వారా వెలికి తీస్తున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పేర్కొన్నారు..
శనివారం చిత్తూరులోని మెసానికల్ గ్రౌండ్ నందు జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు విచ్చేయగా, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ రమ్య, ఐసిడిఎస్ జోనల్ చైర్ పర్సన్
శైలజా రెడ్డి,జడ్పీ మహిళా స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ భారతి,ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా
జేసి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ.... రాష్ట్రస్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలకు ఎంపిక కాబడ్డ క్రీడాకారులనుఅభినందించారుఈ నెల 9 నుండి 13 వరకు విశాఖపట్నంలో జరుగు రాష్ట్రస్థాయి ఆడుదాం ఆంధ్ర లో గల క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో–ఖో, షటిల్ బాడ్మింటన్ వంటి 5 క్రీడలలో
పోటీలలో చిత్తూరు జిల్లా పేరు నిలబెడుతూ పోటీలలో రాణించి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగాబహుమతులు పొందాలన్నారు.రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాబడ్డ క్రీడాకారులకు జిల్లా నుండి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈనెల 7వ తేదీన విశాఖపట్నం నకు ప్రత్యేక బస్సులలో క్రీడా కారులను తీసుకొని వెళ్లడం జరుగుతుందన్నారు. వారికి అవసరమైన వసతి, తదితర ఏర్పాట్లు అన్ని చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించిందని, ఇందులో భాగంగా గ్రామ/వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ,జిల్లా స్థాయి లో విజయవంతంగా నిర్వహించు కున్నామన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా కలెక్టర్ సలహాలు సంబంధిత అధికారుల సమన్వయంతో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీల నిర్వహణపై మీడియా వారు కూడా ప్రత్యేక కథనాలతో కవరేజ్ చేయడం జరిగిందని ఇలా ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేయడం లో భాగస్వాములైన అందరినీ అభినందించారు.
రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారులకు మంచి వేదిక ఏర్పాటు చేశారన్నారు.
జడ్పీ వైస్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ఈ జిల్లాస్థాయి పోటీలలో గెలు పొందిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రస్థాయి పోటీలలో రాణించాలన్నారు.
ఐసిడిఎస్ జోనల్ చైర్మన్ మాట్లాడుతూ...
ప్రజల మానసిక ఉల్లాసాన్ని, శారీర ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తుందని, అన్ని వేళలా రాష్ట్ర ప్రజల మేలు కోరే ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. యువత తమ శారీరక దృఢత్వాన్ని, పెంపొందించుటకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించు కొనుటకు ఆడుదాం ఆంధ్ర ఒక మంచి వేదిక అని తెలిపారు. ఎంతోమంది క్రీడాకారులకు ఈ కార్యక్రమం వారి క్రీడా ప్రతిభను చాటుకునేందుకు ఉపయోగ పడిందన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళుతున్న క్రీడాకారులను అభినందించారు.చదువుతో
పాటు క్రీడలు కూడా ఎంత అవసరమన్నారు.ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల ద్వారా క్రీడాకారులకు ఎంతో మంది సహచర క్రీడాకారులతో సత్సంబంధాలుఏర్పడతాయన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో క్రీడాకారులకు ఇది ఎంతో ఉపయోగ పడు తుందన్నారు. కరోనా పరిస్థితులను ఎదుర్కొని క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ధైర్యం చేసి విద్యార్థులలో యువత, ప్రజలలో క్రీడాశక్తిని పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతున్నదన్నారు.దీనితో పాటు కార్పొరేట్ విద్య ను ప్రభుత్వ పాఠశాలలో అందిస్తూ విద్యాభివృద్ధికి ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని తెలిపారు.
జడ్పీ మహిళా స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలన్నారు..
జిల్లా స్పోర్ట్స్ అధికారి బాలాజీ మాట్లాడుతూ శ్రీయుత జిల్లా కలెక్టర్,జిల్లా జాయింట్ కలెక్టర్ వారు ఈ పోటీల నిర్వహణకు తగు ప్రణాళికతో సమర్థ వంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసి ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా ముందుకు నడిపించారని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
చివరిగా ఈ కార్యక్రమాలలో భాగంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో–ఖో, షటిల్ బాడ్మింటన్ 5 విభాగాల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన విజేతలకు ముఖ్య అతిథులతో పాటు ప్రజాప్రతినిధులు సర్టిఫికెట్లు, మెడల్స్ తో పాటు కప్ లను అందజేశారు.
ఈ కార్యక్రమం లో బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, చిత్తూరు ఆర్డిఓ చిన్నయ్య,పి ఈ టి లు,క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment