రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం
రవి కిరణాలు
తిరుపతి, ఫిబ్రవరి26 :-
ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజక వర్గంలో హంద్రీ నీవా జలాల విడుదల సందర్భంగా పర్యటించనున్న నేపథ్యంలో సోమవారం ఉదయం 10.01 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి గారి వెంట రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి,అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి గౌతమి, తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి ఎస్పీ మలిక గర్గ్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొ. భారతి, రిజిస్ట్రార్ ప్రొ. రజని, తిరుపతి పార్లమెంట్ సభ్యులు యం. గురుమూర్తి, ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూధన రెడ్డి, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ సమన్వయ కర్త నేదురుమల్లి రాం కుమార్, తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి గారు 10.19 గం.లకు రేణిగుంట నుండి చిత్తూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్ళారు.
Post a Comment