ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి : ఏఐటియుసి
రవి కిరణాలు తిరుపతి జిల్లా (సూళ్లూరుపేట) తడ ఫిబ్రవరి 24:-
తడ మండలం లో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటియుసి నెల్లూరు జిల్లా మాజీ ఉప ప్రధాన కార్యదర్శి సి సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం కారూరు చెక్ పోస్ట్ వద్ద ఏఐటియుసి అనుబంధ సంస్థ తో ఆటో స్టాండ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి పతాకాన్ని సీనియర్ ఆటో కార్మిక నాయకుడు ఓ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం తర్వాత దేశంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అతి పెద్ద రంగం ఆటో కార్మిక రంగమని, అటువంటి ఆటో కార్మికుల పట్ల ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి కనబరచడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డుతో పాటు వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించాలని, ఆటో కార్మికులకు ఈ చలాన్ ల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు జరిగిన ఏఐటియుసి అండగా నిలబడుతుందని పోలీసులు, ఆర్టీవోలు,ఫైనాన్షియర్ల ఇబ్బందుల నుండి కార్మికులకు రక్షణ కల్పించేలాగు ఏ ఐ టి యు సి పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య నాగేంద్రబాబు ఆటో యూనియన్ నాయకులు రజిని ఏడుమలై, రమేష్, హరి మరియు ఆరంభకం ఆటో యూనియన్ నాయకులు మస్తాన్,రవి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment