రైతులకు సంఘీభవం తెలిపిన సూళ్లూరుపేట రైతు సంఘం, సీఐటీయూ నాయకులు.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఫిబ్రవరి 22:-
ఫిబ్రవరి 13న ప్రారంభమైన రైతు ఉద్యమంలో బుధవారం నాడు 24 సం " సుభకరణ్ సింగ్ ప్రాణాలర్పించాడు. హర్యానా పోలీసులు రైతుల మీద జరిపిన దమనకాండలో అనేక మంది గాయపడ్డారు. పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా బుధవారం నాడు పంజాబ్-హర్యాన ఉద్యమకారులు నిరసన తెలియజేసారు. ప్రదర్శకుల మీద పోలీసులు విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలో అనేక మంది నాయకులు కార్యకర్తలు గాయపడ్డారు. బీజేపి ప్రభుత్వం దమనఖాండను ఖండిస్తూ, రైతులకు మద్దతుగా సూళ్లూరుపేట రైతు సంఘం మరియు సిఐటియు అనుబంధ సంఘాలు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ అల్లెయ్య లక్ష్మయ్య రమణయ్య రియాజ్ కరీమ్ రామయ్య పళణి తదితరులు దేశ వ్యాప్త రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు
Post a Comment