ఎన్నికల విధులపై బిఎల్ఓలు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి: తహసిల్దార్ శ్రీనివాస శర్మ.

 ఎన్నికల విధులపై బిఎల్ఓలు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి: తహసిల్దార్ శ్రీనివాస శర్మ.

చిట్టమూరు రవి కిరణాలు న్యూస్



ఎన్నికల విధులపై బిఎల్ఓలు అవగాహన పెంపొందించుకుని అప్రమత్తంగా ఉండాలని చిట్టమూరు తహసిల్దార్ శ్రీనివాస్ శర్మ ఆదేశించారు. మంగళవారం శ్రీశక్తి భవనంలో బిఎల్ఓలతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు,సలహాలు అందించారు. బిఎల్ఓలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు.ఎన్నికలసమయంలో పర్యవేక్షణకు విచ్చేసే అబ్జర్వర్లుకు పోలింగ్ కేంద్రాలపై సమగ్ర సమాచారం అందించేలా బిఎల్ఓలు  వ్యవహరించాలన్నారు.ఎన్నికల విధుల్లో ఎటువంటి పొరబాట్లు జరిగినా క్రమశిక్షణా చర్యలు తప్పవన్న ఆయన ఓటర్ల జాబితా పరిశీలన నుండి,ఓటర్లకు అవసరమైన వసతుల ఏర్పాటు, ఎన్నికల వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.గుర్తించిన సమస్యాత్మక,అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టితో మరింత అవగాహనతో ఉన్నత స్థాయి అధికారులతో సంప్రదింపులు జరిపి ఎన్నికల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిటి విజయలక్ష్మి, రీసర్వే డిప్యూటీ తహసిల్దార్ నిరంజన్,ఆర్ఐ మధులత, బిఎల్ఓలు పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget