అక్రమంగా తరలిస్తున్న 500 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం
నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 500 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం రావడంతో తిరుపతి డిఎస్ఓ రఘువీర్ తన సిబ్బందితో కలిసి నాయుడుపేట జాతీయ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో 10 లక్షల రూపాయలు విలువ చేసే 500 బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి ఏఎంసీ గోదాములకు తరలించి కేసు నమోదు చేశారు.
Post a Comment