జర్నలిస్టుల సమస్యలపై ఎన్ యుజే(ఐ)ఎప్పుడు స్పందిస్తుంది
గుంటూరు, జనవరి 30:- గ్రామీణ స్థాయి నుండి పట్టణ, జిల్లా స్థాయి జర్నలిస్టుల సమస్యలపై ఎన్ యుజే(ఐ)ఎప్పుడు స్పందిస్తుందని
వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పాల లక్ష్మణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కేంద్రంలోని వైన్ కల్యాణ మండపంలో ఎన్ యు జె(ఇండియా) అనుబంధంగా ఉన్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం జాప్ ఫౌండర్ మాజీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఉప్పల లక్ష్మణ్ ఆదేశాల మేరకు , జాప్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా హాజరైన ఎన్ యు జె ఐ(ఇండియా) కార్యదర్శి ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రిడిటేషన్ లు దాదాపు అర్హులందరికీ వచ్చాయని, ఎవరైతే రాని వారు ఉన్నారో వారందరికీ వచ్చే విధంగా రాష్ట్ర కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల అనంతరం జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం గురించి కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ పై వచ్చే రైల్వే పాస్ లు త్వరలో వచ్చేలా ఎన్ యు జె(ఇండియా) ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్ యు జె(ఐ) అధ్యక్షులు రాస్ బిహారి, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ తీవారి సంబంధిత శాఖ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొని పోయారన్నారు. జిల్లాల్లో, మండలాల్లో జాప్ యూనియన్ పటిష్టం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జాప్ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వి. సత్యనారాయణ, ఏ.సత్యనారాయణ, రామచంద్ర రెడ్డి, దాడుల కమిటీ కన్వీనర్ ఎల్లారెడ్డి, గుంటూరు జిల్లా ప్రతినిధులు వాక శ్రీనివాస్ రావు, శరణ్యటివి శ్రీనివాస్, గుంటూరు జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు లలితాదేవి, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, పలు జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు.
Post a Comment