వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి అధికారుల సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. నెల్లూరు నగరం రూరల్ నియోజకవర్గం వినాయక చవితి ఉత్సవాలు, గణేష్ నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి ఉన్నత అధికారుల సమీక్ష సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణ్ గారు,జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి గారు నెల్లూరు నగర కమిషనర్ వికాస్ మర్మత్, ఏ ఎస్ పి, నెల్లూరు ఆర్డీవో తదితరులతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సమక్షించారు. సమావేశానికి హాజరైన వివిద గణేష్ ఉత్సవాల కమిటీల సభ్యులతో వారివారి అభిప్రాయాలను, సూచనలను సమావేశంలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. గణేష్ నిమజ్జనం ఉత్సవాలను స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద, పెన్నా నది తీరమున నిర్వహించేందుకు అవసరమైన చర్యలతోపాటు, కట్టుదిట్టమైన ఏర్పాట్లను తీసుకోవాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సూచించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా వచ్చే వినాయకుని ప్రతిమలకు ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందుగానే ప్రజలలో అవగాహన చర్యలు చేపట్టి వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డిగారు, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిగారు వివిధ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Post a Comment