మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు బాగుండాలి -ఉప మలేరియా అధికారి సూచన
రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం:
మనం- మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే మనం నివాసముంటున్న పరిసరాలు బాగుండాలని సూళ్లూరుపేట సబ్ యూనిట్ ఉప మలేరియా అధికారి రమేష్ బాబు గ్రామస్తులకు సూచించారు. ఆయన శుక్రవారం ఫ్రైడే- డ్రై డే కార్యక్రమంలో భాగంగా దొరవారి సత్రం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్త రత్నయ్య, ఆశా కార్యకర్త స్వాతిలతో కలిసి గృహ సందర్శన చేపట్టారు. గృహాల్లో నీటి నిల్వలు, మురికి నీటి కుంటలు , వృధాగా పడేవేసిన పాత టైర్లలో దోమల లార్వాలు పరిశీలించారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు దోమలతో సంభవిస్తున్న పలు రకాల జ్వరాలు మనకు శోకకుండా ఉండాలంటే మన పరిసరాల్లోని నీటి నిల్వలలో దోమల లార్వాలు ఉత్పత్తి చెందకుండా, ప్రాథమిక స్థాయిలోనే వాటిని అరికట్టాలని, వారంలో ఒక రోజైనా నీటి పాత్రలోనే నిల్వ ఉన్న నీటిని పారబోసి, పాత్రను ఎండబెట్టి నీటిని నింపు వాడుకోవాలని సూచించారు. ప్రధానంగా దోమల లార్వాలు పాత టైర్లు, వాడి పారేసిన కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ కాళీ డబ్బాలు ఇంటి పరిసరాల్లో లేకుండా ముందు జాగ్రత్తగా పడాలని వివరించారు. చలి జ్వరముతో కూడిన లక్షణాలు కనిపిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స పొందాలని తెలియపరిచారు. ఈ దినం ఏ కొల్లు, నెల బల్లి, కొత్తపల్లి, వేణుంబాకం,, పూల తోట, పోలిరెడ్డి పాలెం, ఉచ్చూరు, తనియాలి, సచివాలయాల పరిధిలో ఫ్రైడే ఫ్రైడే సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు లార్వా సర్వే చేపట్టారు
Post a Comment