తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యం.
డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నాయకత్వంలో కంకణ బద్ధులై పని చేస్తాం:ఎల్లసిరి నాగార్జున.
చిట్టమూరు రవి కిరణాలు న్యూస్;
తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్,మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నాయకత్వంలో బాధ్యతగా పనిచేసి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీ గూడూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఎల్లసిరి నాగార్జున తెలిపారు.శుక్రవారం గూడూరులో తనకు పదవి కట్టబెట్టిన గూడూరు మాజీ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ ను మహాజనసైన్యం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చేవూరు సురేంద్ర తో కలసి పూలమాలలు, శాలువాలతో సన్మానించి సత్కరించి,కృతజ్ఞతలు తెలియజేశారు.తనపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన సునీలన్న నాయకత్వంలో పార్టీ పటిష్టతకు,తెలుగుదేశం పార్టీ విజయానికి,బడుగు,బలహీన వర్గాలకు అందుబాటులో ఉండి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా, క్రియాశీలకంగా,కష్టపడి పని చేస్తానని ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నియోజికవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏసుపాక పెంచలయ్య ,ఎంజేయస్ రాష్ట్ర కార్యదర్శి కత్తి లక్ష్మణ్,విద్యార్థి నాయకులు అనిల్,యశ్వంత్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post a Comment