ప్రతి పేద వాడి గుండెల్లో వైఎస్ జగన్..........ఎమ్మెల్యే రామిరెడ్డి




 ప్రతి పేద వాడి గుండెల్లో వైఎస్ జగన్

...........ఎమ్మెల్యే రామిరెడ్డి

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి నేరుగా అందించే ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 34 వ వార్డులో 175 వ రోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. 34వ  వార్డ్ ఇన్చార్జిలు గుర్రం వెంకటేశ్వర్లు పుల్ల శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ప్రతి గడపలో మహిళలు వచ్చి శాలవాలతో పూలమాలలతో సత్కరించి ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలిలోప్రతి ఇంటికి జగనన్న ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ, కలుగోలమ్మపేటలోని పెద్ద పావని వంతెన, తుమ్మలపెంట రోడ్లు తొందర్లోనే పనులు పూర్తవుతాయని అన్నారు.ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పదాలు అందాయని ప్రజలంతా ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మరల జగనన్నను సీఎం గా చేసుకుందామని ఎదురు చూస్తున్నారన్నారు. 175 వ రోజు 34 వార్డులో పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ వార్డులో గడపగడప కార్యక్రమానికి వందలాదిగా మహిళలు ఎమ్మెల్యే తో కలిసి నడవడం పలువురిని అబ్బురపరిచింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్,పట్టణ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, గంధం ప్రసన్న ఆంజనేయులు, కనపర్తి రాజశేఖర్, కుందుర్తి సోదరులు,కావలి పట్టణ ప్రచార ప్రధాన కార్యదర్శి నెల్లూరు వెంకటేశ్వర అమర సుబ్బరాయుడు గుప్త, పెనుమల్లి అశోక్,వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి వైయస్సార్సీపి నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget