ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం మాది.....
వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి
పోర్టు సాధించిన ఘనత ఎమ్మెల్యే
రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ప్రాణాలు అందించిన ప్రభుత్వ ఏదైనా ఉందంటే అది ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం కావలి పట్టణంలోని 34 వార్డులో 175 వ రోజు జరిగిన గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలు అందించడంలో ముందున్నారని ప్రశంసించారు. పార్టీలకు కులాలకు, మతాలకు అతీతంగా ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా అందించడం ఎంతో గర్వకారణం అన్నారు. కావలిలో పార్టీ మెరుగ్గా ఉందని మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి తరఫున రంగంలో దిగుతున్నట్లు ఆయన చెప్పారు. తమను కూడా ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే పార్లమెంట్ కు వెళ్లి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధిలో కావలికి ప్రధాన పీఠ వేస్తానని హామీ ఇచ్చారు. ఈ అభిమానం చూస్తుంటే ప్రతాపరెడ్డి అభివృద్ధి బాగా చేశారని మరోసారి అడక్కుండానే ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అర్థమవుతుందని వేమిరెడ్డి అన్నారు.
పోర్టు సాధించిన ఘనత ఎమ్మెల్యేదే......
కావలికి అతి సమీపంలో ఉండే రాయపట్నం పోర్టు సాధించిన ఘనత ఒక కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి కె దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రజల కోసం పోరాడి తెచ్చా కావలికి తెచ్చారన్నారు. నెల్లూరు జిల్లాలో రెండు పోర్టులు రావడం ఎంతో విశేషమన్నారు. కృష్ణపట్నం పోర్టు 42 కిలోమీటర్ల దగ్గరలోనే మరో పోర్టు రాయపట్నం రావడం కావలి అభివృద్ధికి ఎంతో దోహదమవుతుందని ఈ పోర్టు వల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని వేమిరెడ్డి అన్నారు. ఈ రామయ్య పట్నం, పోర్ట్ జువ్వల దీన్నే ఫిషింగ్ హార్బర్ వల్ల కావలి కనకపట్నం మరి ఎన్నో తరాలకు ఉపయోగపడుతుందన్నారు.
Post a Comment