జగనన్న పాలనలో కావలి కనకపట్నం..... రామిరెడ్డి
60 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు......
కావలి రవి కిరణాలు::: రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న పాలనలో కావలి కనకపట్నం గా మారిందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం 3,4 వార్డులలో 60 లక్షలతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన వెంటనే రెండు నెలల్లోనే ఈ వార్డులకు నిధులు మంజూరు అయ్యాయన్నారు. ఈ నిధులతో వార్డుల్లోని నూతన మురికి కాలువలు, సిసి రోడ్లు నిర్మించుకునే అవకాశం లభించిందన్నారు. గడపగడప ప్రభుత్వంలో ప్రతి కుటుంబం హారతులతో స్వాగతం పలుకుతుందని అది ఎంతో ఆనందాన్నిస్తుందని, పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కావలికి సమీపంలోనే రామాయపట్నం పోర్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని దీంతో కావలిలో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు. పోర్టుకు సమీపంలో ఉండే పట్టణం కావలి కావడం ఎంతో విశేషం అన్నారు. పోర్టు పనులు పూర్తయితే బ్రహ్మంగారు చెప్పినట్టు కావలి దశ తిరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వం పోర్టు ఊసే ఎత్తలేదు అన్నారు. జగనన్న అధికారం రాగానే రామయ్య పట్నం పోర్ట్, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మొదట ప్రాధాన్యత ఇచ్చి పనులను వేగవంతం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఈగ కిరణ్, పట్టణ అధ్యక్షులు శివ కుమార్ రెడ్డి, కనపర్తి రాజశేఖర్, గంధం ప్రస్తుతం ఆంజనేయులు, నారాయణ నెల్లూరు వెంకటేష్ రెడ్డి, తల్లపునేని ప్రభాకర్ నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు.
Post a Comment