పేద లను అభివృద్ధి చేయడమే మా అజెండా............. ఎమ్మెల్యే రామిరెడ్డి


 పేద లను అభివృద్ధి చేయడమే మా అజెండా............. ఎమ్మెల్యే రామిరెడ్డి

 175 స్థానాలు గెలిచి జగనన్నకు గిఫ్ట్ గా ఇస్తాం...

 గడపగడపకు ప్రజల ఘన స్వాగతం.....

 ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి......

 కావలి రవికిరణాలు ::::

.        పేద ప్రజలను అభివృద్ధి పథంలో నడపడమే తమ పార్టీ ప్రధాన అజెండా అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని పాత ఊరు లో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సంక్షేమం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నను చూసి నేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేతకు సూచించారు. ప్రజల కష్టాలను జగనన్న దగ్గరుండి చూశారని ఆయన పెట్టిన మేనిఫెస్టో పేద ప్రజలకు ఎంతో మేలుగా ఉందని ప్రజలు చెబుతున్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి చెప్పిన హామీలే కాకుండా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు పుట్టకోక అబద్ధం చెప్పి ప్రజలను మళ్లీ మభ్య పెట్టాలని చూస్తున్నారని ప్రజలు మల్ల వారి నమ్మి మోసపోరని చెప్పారు. రాష్ట్ర మొత్తం ప్రజలు మరోసారి జగన్ నాయకత్వాన్ని బలపరిచి ముఖ్యమంత్రిగా చేయాలని సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో 175 స్థానాలకు గాను 175 స్థానాలు గెలిచి తీరుతామన్నారు. తాను చేస్తున్న గడపగడప మన ప్రభుత్వంలో సామాన్య ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రతి ఒక్క మహిళ మా ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందామని జీవితంలో జగనన్నను మర్చిపోమని చెప్తుండడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలోనే కాకుండా దేశం లోనే ఆదర్శంగా ఉన్నాయన్నారు. పథకాలు అమలవుతుంటే చూసి ఓర్వలేక చంద్రబాబు పిచ్చి ప్రగల్బాలు పలికి అపహాసపాలు అవుతున్నారన్నారు. పేద ప్రజల కోసం ముందుండి సహాయం చేయాలంటే ఒక వైఎస్ఆర్సిపి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జనిగర్ల  మహేంద్ర యాదవ్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్  ఫ్లోర్ లీడర్ కన్నమర్లపూడి నారాయణ, పార్టీ ప్రచార ప్రధాన  కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, జేఏసీ కన్వీనర్లు కనపర్తి రాజశేఖర్, అనురాధ, గంధం ప్రసన్నాంజనేయులు,మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget