షెడ్యూల్డ్ కులాల యువతకు లెదర్ సెక్టార్ స్కిల్స్ పై శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ
తడ: -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని షెడ్యూల్డ్ వర్గాల అభ్యునతి కొరకై అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఇందులో భాగంగా షెడ్యూల్డ్ కులాల యువతకు లెదర్ సెక్టార్ స్కిల్స్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషకరంగా ఉందని, షెడ్యూల్డ్ కులాల యువతకు నేడు లెదర్ సెక్టార్ స్కిల్స్ పై శిక్షణ కేంద్రాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య తో పాటు కలిసి ప్రారంభిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
మంగళవారం మధ్యాహ్నం స్థానిక తడ మండలం పులివెంద్ర నందు పిమ్ - ఏ జె ఏ వై స్కీం లో భాగంగా - ఏపి ఎస్సిఎఫ్ సి -లిడ్ క్యాప్ వారి ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు లెదర్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో ఎస్సి యువత అభివృద్ధి కొరకు ఉచిత వసతి మరియు శిక్షణ కార్యక్రమ ట్రైనింగ్ సెంటర్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి వర్యులు మేరుగు నాగార్జున గారు మరియు గౌ. సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తో పాటు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రం లోని షెడ్యూల్డ్ వర్గాల అభ్యునతి కొరకై అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఇందులో భాగంగా షెడ్యూల్డ్ కులాల యువతకు లెదర్ సెక్టార్ స్కిల్స్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి లెదర్ ప్రొడక్ట్ డెవలపర్ కోర్సు నందు ఉచిత వసతి మరియు శిక్షణను ఇవ్వనున్నారని అన్నారు. ఈ శిక్షణ అనంతరం వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామని తెలియచేశారు.
సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ తమ సొంత నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాల యువతకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించడం చాలా సంతోషం అని, ఈ శిక్షణ ను ప్రతి ఒక నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలనీ, లెదర్ స్కిల్స్ పై సాంకేతిక పరమైన మెళకువలపై మరింత అవగాహన అవసరం అని భవిష్యత్ రోజుల్లో లెదర్, ఫ్యాషన్ టెక్నాలజీ కి మంచి రోజులు ఉన్నాయని అందుకు తగ్గట్టుగా మాంబట్టు సెజ్ నందు సుమారు 200 ఎకరాలలో భారత్ లెదర్ పరిశ్రమ కూడా స్థాపించడం జరిగింది అని, తమ నియోజక వర్గం అభివృద్ధికి అన్ని విధాలా సాయం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మురి కనక రావ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ వర్గాల కొరకు చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ వైస్ ఛాన్సలర్ మరియు మేనేజింగ్ డైరక్టర్ శ్రీ టి. డోల శంకర్ మాట్లాడుతూ ఈ శిక్షణ పొందిన ప్రతి ఒక యువత కు ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రఘు రెడ్డి, ఏపి ఎస్ సి ఎఫ్ సి సంస్థ డైరెక్టర్లు, లిడ్ క్యాప్ సిబ్బంది, రాష్ట నైపణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి శ్యామ్ ప్రసాద్ మరియు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.
Post a Comment