విద్యార్థుల్లో నులిపురుగుల నివారణకై ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ


 విద్యార్థుల్లో నులిపురుగుల నివారణకై ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం న్యూస్ :-

 విద్యార్థుల్లో పలు రోగాలకు కారణమవుతున్న నులి పురుగుల నివారణకై బుధవారం దొరవారిసత్రం మండలంలో "జాతీయ నులిపురుగుల నివారణ దినం" నిర్వహించారు. దొరవారి సత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సచివాలయాల పరిధిలో ఉన్న అంగన్వాడి, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు, కళాశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు ఆల్బెండజోల్ మందులు పంపిణీ చేశారు. ప్రతి కేంద్రంలో మందులు పంపిణీకై ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, ఎం ఎల్ హెచ్ పి, హెల్త్ అసిస్టెంట్లను ఏర్పాటుచేసి మధ్యాహ్నం భోజనానంతరం పాఠశాలల ఉప ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో మందులు మింగించారు. అంగన్వాడి కేంద్రంలోని  పిల్లలకు మాత్రల రూపంలో వేయకుండా, ద్రవ రూపంలో చేసి  పిల్లలకు అందించారు. ప్రతి పాఠశాలలో హ్యాండ్ వాష్డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమ పర్యవేక్షకులుగా సి హెచ్ ఓ సంపూర్ణమ్మ, పి హెచ్ ఎన్  పద్మావతి, హెల్త్ విజిటర్ మైధిలి, హెల్త్ సూపర్వైజర్ గోపి కిరణ్ ఏ కార్యక్రమాన్ని పర్యవేక్షించి విజయవంతం గావించారు. పరిశీలనాధికారులుగా  వైద్యాధికారులు వి చైతన్య, కె పళని రాజ్ లు పలు కేంద్రాలను సందర్శించారు. పాఠశాలలోని పిల్లలకు మాత్రను చప్పరించడం ద్వారా, నమిలి మింగడం అనే పద్ధతిలో ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. 8 సచివాలయాల పరిధిలోని కేంద్రాల్లో ఉన్న అర్హులైన పిల్లలు 4149 నమోదు కాగా4072 మంది పిల్లలకు మాత్రలు వేశారు దీంతో98.1శాతం నమోదయింది.ఈ కార్యక్రమంలో ఎం జె పి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతయ్య, కస్తూర్బా కళాశాల  ప్రిన్సిపాల్ పార్వతి ఏఎన్ఎం శ్రావణి,  డోరతి వెంకమ్మ, అమరావతి, రమణమ్మ, వజ్రమ్మ, హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, విజయ్ కుమార్, రత్నయ్య, వెంకటయ్యలు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget