సూళ్లూరుపేట ప్రాంతంలో చిన్న పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ కలకలం.
బీహార్ ఢిల్లీ ప్రాంతాలకు చెందిన ఖిలాడీ లేడీలు పసిపిల్లలే వారి టార్గెట్ వేసుకొని ఎత్తుకొని వెళ్లే యత్నం గమనించిన స్థానికులు కిలాడీ లేడికి దేహశుద్ధి.
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట.-
మండల పరిధిలోని కోటపోలూరు గ్రామం తూర్పు హరిజనవాడ వద్ద బీహార్ కు చెందిన ఓ కిలాడీ లేడీ ఐదేళ్ల బాలుడిని అపహరించడానికి ప్రయత్నించింది అయితే బాలుడు చిన్నాయన సాయికుమార్ గమనించి నిందితురాలిని వెంటాడి పట్టుకోగా ఆ కిలాడీ లేడీ బిడ్డని విడిచిపెట్టింది ఇంతలో గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని కిలాడీకి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ఆ మహిళ బీహార్ వాసవి వీరు మొత్తం పది మంది గ్యాంగ్ అని గ్రామస్తులు వెల్లడించారు పిల్లలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు అదేవిధంగా మరో ప్రాంతమైన మన్నారపోలురు హరిజనవాడ వద్ద మూడేళ్ల బాలికను ఎత్తుకెళ్లడానికి మరో మహిళ ప్రయత్నించింది అక్కడ కూడా స్థానికులు గమనించి ఆమెను పట్టుకోవాలని ప్రయత్నించగా బిడ్డను వదిలేసి పారిపోయింది దీనిపై గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరుకొని తమ ప్రాంతాలలో సంచరిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకొని తమ బిడ్డలకు తమకు రక్షణ కల్పించాలని కోరారు.
Post a Comment