జగనన్న సురక్ష సక్సెస్ - ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య


 

జగనన్న సురక్ష  సక్సెస్ - ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

 రవి కిరణాలు తిరుపతి జిల్లా నాయుడుపేట:-

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం సూళ్లూరుపేట నియోజకవర్గంలో  సూపర్ సక్సెస్ గా విజయవంతం అయిందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. గురువారం నాయుడుపేట పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వంలో  అర్హత గల ప్రతి పౌరుడికి సంక్షేమ పథకాలు అందించామని తెలియజేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కార నేపథ్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి  వివిధ రకాల సర్టిఫికెట్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జూలై 1 నుండి 31వ తేదీ వరకు జరిగిన జగనన్న సురక్ష పథకం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.  నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,46,27,905 కుటుంబాలకు అవసరమైన సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలను 98 శాతం పూర్తి చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ కరీం భాయి చెంచయ్య, మాజీ ఎన్డీసీసీబీ డైరెక్టర్ కలికి మాధవరెడ్డి,సీనియర్ వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దారా రవి,పాలేటి నాగార్జున,పట్టణ జెసిఎస్ కన్వీనర్ చదలవాడ కుమార్,మాజీ ఏఎంసి డైరెక్టర్  నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీటీసీ సభ్యులు హరి రెడ్డి, విన్నమాల సర్పంచ్ వాకాటి సోమశేఖర్, వైసీపీ నాయకులు పాదర్తి హరినాద్ రెడ్డి,కె గోపాల్ రెడ్డి,అన్నమేడు చంద్రారెడ్డి,పేట చంద్రారెడ్డి, కుబేరు మణి, మెస్ భాస్కర్ రెడ్డి, పేర్నాటి రాహుల్, షేక్ రహంతుల్లా, సెందేటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వి.శ్రీనివాసరావు,సి ఐ నరసింహారావు,పలువురు వైసిపి నాయకులు,అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget