మండల పరిషత్ కార్యాలయంలో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ఆత్మ డి పి డి జి శివ నారాయణ.
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట.
పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం నందు ఉన్న సమావేశ మందిరంలో రైతులకు శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఆత్మ వారి సౌజన్యంతో మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆత్మ డి పి డి జి శివ నారాయణ పాల్గొన్నారు అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ చిరుధాన్యాలలో ఇనుము ఖనిజ లవణాలు మరియు పీచు పదార్థాలు అధికముగా ఉంటాయని అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వరి సాగు తర్వాత వాటిని సాగు చేసుకునే పద్ధతులు మెళుకువలను గురించి వివరించారు. అదేవిధంగా వేరుశనగలో పి ఎ జి 24 రకము బదులుగా టి సి సి ఎస్ 1694 రకము మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అని, తిరుపతి నందు అందుబాటులో ఉందని అవి అధిక దిగుబడిని ఇస్తుందని తెలిపారు అనంతరం వరి కోసిన తరువాత జీరో టిల్లేజ్ లో మొక్కజొన్న వేసుకొని ఖర్చులు తగ్గించుకొని మంచి దిగుబడులు సాధించే విధంగా రైతులకు సూచనలు ఇచ్చారు.
కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ జి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వరి నాటుకునేటప్పుడు లేదా ఎల్ది పైరులో జింకు 20 కిలోలు, అన్న బేది 20 కిలోలు ఆఖరి దుక్కిలో వేసుకోవాలని వివరించారు అదేవిధంగా రవి సీజన్లో వరి సాగు వివరములు ఎరువుల యాజమాన్య పద్ధతులు కలుపు నివారణ మరియు విత్తన శుద్ధి గురించి వివరించారు.
అనంతరం సూళ్లూరుపేట వ్యవసాయ సహాయక సంచాకులు జి అనిత మాట్లాడుతూ ప్రభుత్వ రాయితీతో 40 శాతం డ్రోన్లు ఇవ్వడం జరుగుతుందని వాటిని గ్రూపు ద్వారా తీసుకొని పురుగుమందులు పిచికారి ఖర్చులు మరియు సమయం ఆదా చేసుకోవాలని తెలిపారు పచ్చిరొట్ట విత్తనాలు చల్లని భూమి సారవంతం చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించ వచ్చని అదేవిధంగా మట్టి పరీక్షలు చేయించుకుని ఎరువులు అవసరం మేరకు వాడుకొని ఖర్చు తగ్గించుకోవాలని అధిక దిగుబడులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సులూరుపేట మండల వ్యవసాయ అధికారి ఎన్ కవిత తో పాటు కడపట్ర ,కుదిరి, కె సి ఎన్ గుంట, మన్నే ముత్తెరి, జంగాలపల్లి, ఆబాక, కోటపోలూరు, ఇలుపూరు, కొన్నెంబట్టు, మంగళంపాడు మరియు ఇతర గ్రామాల రైతులు పాల్గొన్నారు
Post a Comment