వివాదాస్పద లో ఉన్న దారిని పరిశీలించిన
మండల తాసిల్దార్ విజయలక్ష్మి...
చిట్టమూరు రవి కిరణాలు
మండలంలోనియాకసిరి పంచాయతీపరిధిలోగల పాటిమిట్ట గ్రామం నందు పొలంలోకి వెళ్లి దారి వివాదాస్పదం కావడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్టమూరు మండల తాసిల్దార్ విజయలక్ష్మి మంగళవారం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పొలాలకు వెళ్లేందుకు దారులు గతంలో ఎక్కడ ఉండేవని గ్రామస్తులను అడిగారు. గ్రామస్తులు ఈ పొలాలకు వెళ్లేందుకు గతంలో గుమ్మలదిబ్బ దారి,కలుజు నుండి వచ్చేదని, మరొక దారి నడిం బాట గిరిజన పొలాల మీదగా ఉండేదని ఈ రెండు దారులను కొంతమంది ఆక్రమణ చేసుకొని దారి లేకుండా చేశారని, ప్రభుత్వం వారు పేదలకు ఇచ్చిన సీజేఎఫ్ఎస్, పొలంలో నందు దారి కావాలని కొంతమంది వ్యవసాయదారులు తాసిల్దార్ ని కోరగా సీజేఎఫ్ఎస్ లబ్ధిదారులు ఇక్కడ దారి ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని ఎవరి పొలం ఎక్కడుందో తమకు భిన్నాలు చూపాలని హద్దులు చూపిన తర్వాతనే దారి ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు తాసిల్దారుని కోరారు. అందులకు తాసిల్దార్ గ్రామస్తులకు వివరణ ఇస్తూ సర్వే నెంబర్ 200,199,198 హద్దులలో కలిగిన భూములు ప్రభుత్వం పరంగా నిలుపుదల చేయబడి ఉన్నవని ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన వెంటనే లబ్ధిదారులకు హద్దులు చూపడం జరుగుతుందని, అప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేకుండా వ్యవసాయ దారులు పొలంలోకి వెళ్ళేందుకు రాకపోకలు సాగించుకోవచ్చని తాసిల్దార్ తెలిపారు.ఆమె వెంట మండల సర్వేయర్ లక్ష్మీనారాయణ,పాటిమిట్ట గ్రామస్తులు,సీజేఎఫ్ఎస్ లబ్ధిదారులు ఉన్నారు.
Post a Comment