ఆటో కార్మికుల యూనియన్ ప్రధమ మహాసభ
ఆగస్టు 27న కాళహస్తిలో మహాసభ జరగనుందని, ఈ సభకు కొత్తగుంటలో నున్న ఆటో స్టాండ్ లో కరపత్రాలు విడుదల చేసారు. ఆటో డ్రైవర్లు ఆటో యూనియన్ లీడర్ అందరూ సభకు వచ్చి సభను జయప్రదం చేయాలని అన్నారు కార్యక్రమంలో గూడూరు ఆటో కార్మిక సంఘం సి.ఐ.టి.యు.పట్టణ కార్యదర్శి బి.వి.రమణయ్య మాట్లాడుతూ ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఇ.యస్ఐ, పి.యఫ్ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోలు, డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని, ఆర్టీఒ ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు ఆపాలని, పెంచిన చలాన చార్జీలు ఉపసంహరించాలని, ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా ఆటో కార్మి కులకు రుణాలు ఇప్పించాలని , చదువుతో నిమిత్తం లేకుండా డ్రైవింగ్ పై అనుభవం ఉన్నవారికి ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇవ్వాలి ఆటో డ్రైవర్లకు ఉచిత ఇళ్ల స్థలాలను కేటాయించాలి, తదితర 16 డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో కొత్తగుంట లోని ఆటో యూనియన్ లీడర్ రసూల్ ఖాన్, కార్యదర్శి సునీల్, అధ్యక్షులు , అచీ య్య ఆటో కార్మికులు వెంకటయ్య, వెంకయ్య, రామ్మూర్తి. తదితరులు పాల్గొన్నారు.
Post a Comment