హిందువుల మనోభావాలు పట్టని టీటీడీ .. భక్తులకు ఊత కర్రలు..మీకు గన్ మెన్ లా ?



 హిందువుల మనోభావాలు పట్టని టీటీడీ .. భక్తులకు ఊత కర్రలు..మీకు గన్ మెన్ లా ? 

టీటీడీ పాలకమండలి అనాలోచిత నిర్ణయాలు హిందువుల మనోభావాలు దెబ్బతిసేలా ఉన్నాయని జనసేనపార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. తిరుపతి జిల్లా గూడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయాన్నారు.  తిరుమలకు వెళ్ళు భక్తుల రక్షణ అగమ్య గోచరంగా మారిందని ఇటీవల చిరుత పులి దాడిలో ఒక బాలిక మృతి చెందండం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో ఓ బాలుడిపై చిరుతపులి దాడి చేసి గాయపరచిన సంఘటనను టీటీడీ పాలకమండలి సీరియస్ గా తీసుకొనియుంటే, బాలిక ప్రాణాలకు ముప్పు ఉండేది కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టకుండా, ప్రమాదం జరిగిన పిదప ఎక్స్గ్రేషియాలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. ప్రమాదాలు జరుగకుండా సూచికబోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు, జాగ్రత్తలపై అవగాహనా కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. టీటీడీ పాలకమండలి అనాలోచిత చర్యలు హిందువులు, తిరుమలకు వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. తిరుమల కొండకు నడిచి వెళ్ళు భక్తులకు ఊత కర్రలు ఇస్తామని వాటితో అడవి మృగాల భారి నుండి ఇబ్బందులు ఉండవని టీటీడీ ఛైర్మెన్ చెప్పడం బాధ్యత రహితంగా ఉందని విమర్శించారు. భక్తులకు ఏమో ఊత కర్రలు.. మీకేమో గన్ మెన్ లా అని ప్రశ్నించారు. అభం శుభం తెలియని చిన్నారులు జగనన్న ఊత కర్రల సాయంతో చిరుతపులులతో పోరాడి ప్రాణాలు రక్షించుకోవాలనే ఆయన తెలివికి జోహార్లు తెలిపారు. టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఊత కర్రల పంపిణీకై జీవో విడుదల చేసారంటూ ఎద్దేవా చేసారు. అందరూ కోరుకునే విధంగా భక్తులకు రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు.  జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయయాత్ర మూడవ దశ  ఉత్తరాంధ్రలో విజయవంతంగా జరుగుతుందని  విశాఖ జిల్లాలో వైసీపీ నాయకుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పెద్దిశెట్టి, ఇంద్రవర్ధన్, కుందర్తి నాగార్జున, ధనుంజయలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భజన బృందం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం వారి చేతకానితనాన్ని  సూచిస్తుందని  పేర్కొన్నారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లు వారికి ఇచ్చిన శాఖల పై కనీస అవగహన లేదని, మీడియా సమావేశాల్లో లేఖి బాషా మాట్లాడ్డం మాని వారి శాఖల పై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్సులు కుమార్, అవినాష్, శంకర్ రాకేష్, సంతోష్, సాయి, శ్రీనాధ్ తదితరులున్నారు.


Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget