అందరికీ మంచి చేస్తున్న సీఎం జగనన్నను అందరూ మంచి మనసుతో ఆశీర్వదించండి -ఎమ్మెల్యే కిలివేటి
-హారతులు పట్టి ఘన స్వాగతం పలికిన మహిళలు
రవికిరణాలు ప్రతినిధి దొరవారిసత్రం న్యూస్ :- అందరికీ మంచి చేస్తున్న సీఎం జగనన్నను అందరూ మంచి మనసుతో ఆశీర్వదించండి అంటూ సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు ఆయన గురువారం దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాళెం సచివాలయం పరిధిలోని నెమలిమిట్ట అగ్రహారం కృష్ణాపురం అక్కరపాకు పోలిరెడ్డిపాలెం గొల్లపాలెం సూరపుఅగ్రహారం మొదలగు గ్రామాలలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం " కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి నాలుగేళ్ల వైసీపీ పాలనలో సీఎం జగనన్న అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారికి బుక్లెట్ అందించి... ప్రభుత్వం ద్వారా వారికి నాలుగేళ్లలో అందిన సంక్షేమాన్ని వివరిస్తూ... ప్రతి గడపలో ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, వాలంటీర్లు స్పందిస్తున్నారా... సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉంది అంటూ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అడిగి తెలుసుకున్నారు దీనికి గ్రామ ప్రజలు అందరూ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలు వాలంటీర్ల ద్వారా మాకు అందుతున్నాయని ఎమ్మెల్యే కి తెలియజేశారు తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ను చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ని ఆ గ్రామ నాయకులు శాలువాలు కప్పి, మహిళలు హారతులు పట్టి సాగర స్వాగతం పలకగా.... అందరికీ మంచి చేస్తున్న సీఎం జగనన్నను అందరూ మంచి మనసుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగనన్న ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ... తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగనన్నను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు... రోజుకొక ఆరోపణలు చేస్తూ జగనన్నకు అవినీతి మరక అంటించాలని చూస్తున్నారు కానీ వారు చెప్పేది ఏది ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని.... ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను దేశంలోని చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని వారి రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు చూస్తున్నారు అని, ప్రజలకు ఇంత మంచి చేస్తున్న జగనన్నను మరో మారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసిపి గెలవడం ఖాయమని ఇకనైనా ఆరోపణలు మాని ప్రజల పక్షాన పోరాటాలు చేయడం మర్చిపోవద్దు అని ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు రమేష్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి నాయకులు సురేష్ రెడ్డి దొరవారిసత్రం ఎస్సై తిరుమల రావు ఎంపీడీవో సింగయ్య వైయస్సార్ క్రాంతి పథం ఏరియా కోఆర్డినేటర్ మురళి ఏపిఎం పద్మావతి కమ్యూనిటీ కోఆర్డినేటర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు
Post a Comment