విశ్వరూప మహాసభ బిజెపి పతనానికే..!!
ఎం.ఎస్.పి జిల్లా ఇంచార్జి మంద పెంచలయ్య మాదిగ.
రవికిరణాలుప్రతినిధి -దొరవారిసత్రం న్యూస్ :-
ఎస్,సి వర్గీకరణ చట్టభద్దత కోసం ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్ లో జరప తలపెట్టిన మాదిగల విశ్వరూప మహాసభకు జన సమీకరణ నిమిత్తం ముఖ్య అతిధులుగా ఎం.ఎస్.పి తిరుపతి జిల్లా అధ్యక్షులు తురక అమర్నాథ్ వడ్డెర ఎం.ఎస్.పి జిల్లా నాయకులు నరేష్ వడ్డెర ముఖ్య అతిధులుగా విచ్చేయగా సూళ్లూరుపేట నియోజకవర్గం లోని మహాదేవయ్య నగర్ మాతమ్మ గుడి వద్ద గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులుగా కయ్యారపు రాజబాబు కయ్యారపు మురళి, ఎం.ఎస్.పి రాష్ట్ర నాయకులు లేబాకం మురళి ఎన్నుకోవడం జరిగింది తదుపరి నూకలపాలెం గ్రామంలో కమిటీ సభ్యులుగా జడ రాజా, గోచి రమణయ్య, గోవిందు గంగయ్య, దూదేపల్లి మాతయ్య, జడ రత్నయ్య గోచి నాగరాజు ఎన్నికైనారు తదుపరి దొరవారిసత్రం మండలంలోని ఏకొల్ల అరుంధతియవాడలో గ్రామ కమిటీ సభ్యులుగా గోవిందు సునీల్ గోవిందు మాతయ్య ఉచ్చురు సుబ్రహ్మణ్యం గోవిందు వాణి కోతిపాక వెన్నెల మాదిగ ఎన్నికైయ్యారు. తదుపరి వేణుంబాకం గ్రామంలో గ్రామ కమిటీలను నియమించటం జరిగింది. ప్రతి గ్రామంలో మాదిగ విద్యార్థి సమైక్య మాదిగ మహిళా సమైక్య మాదిగ ఉద్యోగుల సమైక్య కమిటీలతో పాటు ఎం. ఆర్. పి.యస్ కమిటీలను నిర్మిస్తూ మాదిగల విశ్వరూపాన్ని హైదరాబాద్ లో ముప్పై లక్షల మంది మాదిగలు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ వామ పక్షాలు దేశం లోని ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా జరగబోవు పార్లమెంట్ సమావేశాల్లో గోంతెత్తి మాట్లాడకపోతే ఏ పార్టీలైతే Sc వర్గీకరణ సమస్యపై పార్లమెంట్ లో ప్రస్థావించని పార్టీలను ప్రాంతాల వారీగా ఓడించటానికి విశ్వరూప మహా సభ దిశ దశ నిర్దేశిస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమం సూళ్లూరుపేట నియోజకవర్గం ఎం.ఎస్.పి ఇంచార్జి కుక్కమల్లి రవి మాదిగ దొరవారిసత్రం మండల ఎం.ఎస్.పి ఇంచార్జి కంటేపల్లి నాగేశ్వర రావు మాదిగ అధ్యక్షణ జరగ్గా ఎం.ఎస్.పి జాతీయ నాయకులు గోవిందు వాసు మాదిగ దొరవారిసత్రం మండలం ప్రధాన కార్యదర్శి గోవిందు సునీల్ నాయుడుపేట మండల ఎం.ఎస్.పి ఇంచార్జి మాచవరం శ్రీనివాసులు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment