సంక్షేమ పథకాలను ఇస్తున్న జగన్ అన్న మళ్లీ ఆదరించండి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
మండలంలోని దామా నెల్లూరు సచివాలయం పరిధిలో ఉన్న ఉగ్గుమూడి గ్రామంలో సూళ్లూరుపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరు కిలివేటి సంజీవయ్య బుధవారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు.
ఇంటింటికి వెళ్లి జగనన్న పేద ప్రజల కోసం అందిస్తున్న శంషా పథకాల గురించి వివరిస్తూ అర్హులైన అందరికీ అందుతున్నాయా లేదా అని ఆరా తీస్తూ బుక్లెట్లను అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం తలపెట్టిన సంక్షేమ పథకాలను ఎటువంటి అవినీతికి తావు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు సంపాదించారని ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు నేరుగా చూసి తెలుసుకున్నారని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల బాగు మరియు సంతోషం కోసం సుపరిపాలన అందిస్తున్నారని జగనన్న పరిపాలన ప్రజలంతా మనస్పూర్తిగా ఆశీర్వదించి మరోమారు జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి ఉగ్గుమూడి ఆనంద్, సుధాకర్ మొదలియార్ మాజీ డిసిఎం ఎక్స్ డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్, మన్నెముత్తేరి సర్పంచ్ రాజా, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, మండల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment