NCORD సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా యస్.పి. శ్రీ డా.కె.తిరుమలేశ్వర రెడ్డి,IPS




 SPS నెల్లూరు జిల్లా

NCORD సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా యస్.పి. శ్రీ డా.కె.తిరుమలేశ్వర రెడ్డి,IPS., గారు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి NCORD(Narcotics Coordination Meeting) కమిటీ సమన్వయ సమావేశం నిర్వహణ. పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యస్.పి. గారు, కమిటీ సభ్యులు. స్కూల్స్, కళాశాలలు, తదితర పిల్లల భోధనశాలలలో అవగాహన కల్పించాలని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు- కలెక్టర్ గారు  అసాంఘిక శక్తుల వల్ల యువత, తల్లిదండ్రులు, పిల్లల యొక్క ఆశయాలను, జీవితాలను నాశనం చేసుకోకుండా తగు చర్యలు తీసుకొని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లా సాధనే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా ప‌టిష్ట‌ ప్ర‌ణాళిక‌లు- యస్.పి. గారు. జిల్లాలో గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, సేవిస్తున్న వారిపై నిఘా పెంచి PD ACT కేసులు నమోదు చేస్తాం. గంజాయి మొక్కల రకాలు, వాటి ఫోటోలు, సేవించే వారి లక్షణాలను ఆయా శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బందికి, విద్యార్ధులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి.  14500 అనే టోల్ ఫ్రీ నంబర్ బస్సులు, విద్యాసంస్థలు, మాల్స్, గోడల పై ప్రదర్శించాలి. హోర్డింగులు, ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయాలి. తదుపరి అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారు గంజాయి విక్ర‌య, అక్రమ రవాణాను చేధించి కేసుల నమోదు, ముద్దాయిల అరెస్ట్, స్వాధీనం చేసుకున్న వివరాలు, అరికట్టేందుకు చేపడుతున్న ప్రణాళికలను PPT ద్వారా వివరించారు. జిల్లా వ్యాప్తంగా కూడలి ప్రాంతాలలో హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు మరియు స్కూల్స్, కళాశాలలో 183 డ్రగ్ అబ్యూజ్ ప్రివెన్షన్ కమిటీలు ఏర్పాటు చేసి, 391 విద్యాసంస్థలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం NCORD కమిటీ స్టేక్ హోల్డర్స్ మాట్లాడుతూ వారివారి సలహాలు, సూచనలు తెలిపారు.  ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యస్.పి. శ్రీ డా.కె.తిరుమలేశ్వర రెడ్డి,IPS., గారు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్), DM&HO, జిల్లా SC వెల్ఫేర్, DEO, టెర్రీటోరియల్ ఫారెస్ట్ ఆఫీసర్, సబ్ కలెక్టర్ కందుకూరు, JD అగ్రికల్చర్, జాయింట్ కమీషనర్ కమర్షియల్ ట్యాక్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్, RDO, KP పోర్ట్ CEO, ఇంటలిజెన్స్ అధికారులు, జిల్లా SEB అధికారులు మరియు సబ్ డివిజన్, సర్కిల్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.15.07.2023.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget