కవాతును వీక్షించి, దర్బార్ నిర్వహించిన జిల్లా యస్.పి. డా.కె. తిరుమలేశ్వర రెడ్డి,IPS






 SPS నెల్లూరు జిల్లా

కవాతును వీక్షించి, దర్బార్ నిర్వహించిన జిల్లా యస్.పి. డా.కె. తిరుమలేశ్వర రెడ్డి,IPS., గారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డి.జి.పి. గారి ఆదేశాల మేరకు పోలీసు పెరేడ్ గ్రౌండ్ నకు జిల్లా  యస్.పి. గారు ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీసు అధికారులు, సిబ్బంది (సివిల్, ఎ.ఆర్. & హోం గార్డ్స్) నిర్వహించిన గౌరవ వందనం స్వీకరించి ఆద్యంతం కవాతును స్వయంగా వీక్షించి, అభినందించిన జిల్లా యస్.పి. గారు. అనంతరం సిబ్బంది సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా "దర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా యస్.పి. గారు. పోలీసులు క్రమశిక్షణతో ఉంటూ, శారీరిక దారుఢ్యం కలిగి ఉండి, ఎటువంటి విపత్తులను ఎదుర్కునేందుకైన సంసిద్ధంగా ఉండాలి. మీ ఆరోగ్యం బాగుంటునే మీ కుటుంబం కూడా బాగుంటుందని గుర్తుంచుకోవాలి.  పోలీస్ సిబ్బందికి ఉద్యోగ బాధ్యతలతో పాటు వారి సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మీ సంక్షేమం కోసం తక్కువ ధరలతో అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసిన పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ను కుటుంబ సమేతంగా వెళ్ళి వినియోగించుకోవాలని సూచన. పోలీసు శాఖ ప్రభుత్వం యొక్క ముఖ చిత్రం.. అదేవిధంగా రిసెప్షనిస్ట్ పోలీస్ స్టేషన్ వెన్నెముక. ఫిర్యాదుదారులతో మర్యాదగా, ఓపికగా వ్యవహరించాలి. పరుషంగా మాట్లాడవద్దు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్దులు, అణగారిన వర్గాల ఫిర్యదులలో తక్షణం స్పందించాలని ఆదేశాలు. చట్టాలను తెలుసుకోవాలని సూచించి, విధులలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరికలు.. అనంతరం అధికారులు, సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధుల్లో మరియు ఆరోగ్య, విద్య, తదితర అంశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.28.07.2023.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget