నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా యస్.పి. శ్రీ డా. కె. తిరుమలేశ్వర రెడ్డి,IPS





 SPS నెల్లూరు జిల్లా

నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా యస్.పి. శ్రీ డా. కె. తిరుమలేశ్వర రెడ్డి,IPS., గారు

ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహణ. జిల్లాలో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధిత నేరాలలో విచారణ గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్ష. కోర్టు పరిధిలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. పేకాట, కోడిపందాలు, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఎన్ఫోర్స్మెంట్ ను  సమర్థవంతంగా అమలు చేయాలి. దిశ కాల్స్, 112, డయల్ 100 వంటి అత్యసర నెంబర్ల నుండి వచ్చు కాల్స్ కు మరియు NHRC, SHRC ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతతో తక్షణం స్పందించాలి. రౌడీలు, సస్పెక్ట్ లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి, తరచుగా కౌన్సిలింగ్ నిర్వహించి, వారిలో పరివర్తనకు గట్టిగా కృషి చేయాలి. విచారణ దశలో వున్న కేసులను సాంకేతిక పరిజ్ఞాన్ని, వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించి వేగవంతంగా దర్యాప్తుచేసి సంబంధిత కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలి. యాసిడ్, బాణసంచా మందు గుండు సామాగ్రి తయారీ కేంద్రాలకు, వాటిని నిల్వ ఉంచే గూడములకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు ఉండాలని, పోలీస్ అధికారులు వాటిని సందర్శించి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో పెండింగ్ లో ఉన్న  గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, POCSO& రేప్ కేసులు, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 Cr.P.C కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, డిపిఓ కు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, పెండింగ్ NBWs, NDPS కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించి, CD ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించిన యస్.పి. గారు. పెండింగ్ కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు, మెళకువలపై దిశానిర్దేశం.. ప్రాపర్టీ కేసులు విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రాపర్టీ కేసులను త్వరితగతిన చేదించి, బాధితులు నష్టపోయిన సొమ్మును రికవరీ చేసి వారికి న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వాహన తనిఖీలు చేపట్టి, MV చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ, రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చూడాలి.  ప్రజలకు ఫేక్ లోన్ యాప్స్/సైబర్ నేరాలు/LHMS, దిశ యాప్ లపై అవగాహన కల్పించాలని సూచించారు. గత మాసంలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించి అభినందించిన యస్.పి. గారు.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.21.07.2023.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget