SPS నెల్లూరు జిల్లా
పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించిన జిల్లా యస్.పి. శ్రీ డా.కె. తిరుమలేశ్వర రెడ్డి,IPS., గారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది సమస్యలపై ప్రతి శుక్రవారం నిర్వహించే “పోలీస్ వెల్ఫేర్ డే” నిర్వహణ.
పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలి. అనధికారికంగా గైర్హాజరు, నిర్లక్ష్యంతో విధులు నిర్వహిస్తూ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సహించేది లేదని హెచ్చరికలు. వృత్తిపరమైన, ఆరోగ్యపరమైన, మహిళా కానిస్టేబుల్స్ సమస్యల అర్జీలపై సత్వరమే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ. VR, డిజర్సన్, సర్వీసుకు సంబంధించి, అనారోగ్యం, బదిలీలు, ప్రమోషన్స్, క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అర్జీలను సిబ్బంది నుండి స్వయంగా స్వీకరించి, నిశితంగా పరిశీలించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి, యోగక్షేమాలు తెలుసుకొని సాధ్యమైనంత వరకు సహాయం చేస్తానని తెలిపిన యస్.పి. గారు. ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.14.07.2023.
Post a Comment