కడపలో ఉక్కు ప్యాక్టరి స్థాపించాలని సూళ్లూరుపేట ఆర్డీవోకి వినతి పత్రం సమర్పించిన సిపిఎం, సి ఐ టి యు నాయకులు.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
కడపలో ఉక్కు ఫ్యాక్టరీని కొనసాగించాలని సూళ్లూరుపేట ఆర్డిఓ కి సిపిఎం, సిఐటియు నాయకులు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సిపిఎం సూళ్ళూరుపేట కార్యదర్శి కా.బి.పద్మనాభయ్య మాట్లాడుతూ కడప లో ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదని పార్లమెంటులో ప్రభుత్వము ప్రకటించడము రాయలసీమ ప్రజలను మోసము చేయడమేనని, రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఇంతవరకు స్థాపన పేరుతో ఐదుసార్లుశంకు స్థాపన చేసారని, ఈ దాగుడు మూతలు ఆపి వెనుకు బడ్డ రాయలసీమ కడపలో ఫ్యాక్టరీ స్థాపించాలని డిమాండు చేసారు. జిల్లా భ.ని.కా అధ్యక్షులు కా ఏ అల్లెయ్య మాట్లాడుతూ పెద్ద పరిశ్రమలు వస్తేనే నిరుధ్యోగులకు ఉపాది వుంటుందన్నారు. తదుపరి ఆర్డీవో మునిచంద్రకు వినతి పత్రము సమర్పించారు. ఈ కార్యక్రమములో సిఐటియు గౌ అధ్యక్షులు కా కె.సాంబశివయ్య, అధ్యక్ష కార్యదర్శులు డి రమణయ్య, కె లక్ష్మయ్య, ఎస్ కే రియాజ్, భాస్కర్, నాయకులు రామయ్య, పళని, రమణయ్య, వెంకటరత్నం, శ్రీదేవి, చెంగమ్మ, రాజబాబు, విజయ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment