సమగ్ర భూ సర్వే వేగవంతం చేయండి
తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ బాలాజీ
తిరుపతి జిల్లాలో జరుగుతున్న జగనన్న భూ రక్ష- సమగ్ర సర్వే పనులను వేగవంతం చేయాలని అధికారులకు జేసీ బాలాజీ సూచించారు. మంగళవారం నాడు కోట మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే పనులపై ఆరా తీశారు. జిల్లాలో మొదటి ఫేజ్ లో 69 గ్రామాల్లో సర్వే పూర్తయింది అన్నారు. సెకండ్ ఫేస్ లో 188 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు. కోట మండలంలో తిన్నెలపూడి, ఉత్తమ నెల్లూరు, కర్లపూడిలలో సర్వే జరుగుతుందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట తాసిల్దార్ పద్మావతి, డిప్యూటీ తాసిల్దార్ మల్లికార్జునరావు,సర్వేయర్లు,వీఆర్వోలు, ఉన్నారు.
Post a Comment