సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే జగనన్న సురక్ష పథకం- ఎమ్మెల్యే కిలివేటి
లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
రవికిరణాలు ప్రతినిధి- దొరవారిసత్రం న్యూస్:- ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులందరికి అందించడమే జగనన్న సురక్ష పథకం అని సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు ఆయన గురువారం ఏ కోళ్లు పంచాయతీ సచివాలయంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష పథకం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తుదారులకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను వారి ఇంటి వద్దకే అందజేసే విధంగా ప్రభుత్వం తగుచర్యలు చేపట్టింది అన్నారు
గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలుపెట్టి ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికి పథకాలను అందించకుండా డబ్బులు తీసుకొని పథకాలను అమ్మేశారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ,వాలంటీర్లు వ్యవస్థ బాగా పనిచేస్తుంది.వాలంటీర్లు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకూ వెంటనే అందుతున్నాయి,జగనన్న సురక్ష ద్వారా ప్రతి గ్రామాల్లో, పట్టణలో ప్రజలకు మరింత లబ్ది చేకూరుతుంది అని ఎమ్మెల్యే అన్నారు అనంతరం లబ్ధిదారులకు 431 సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గోపిరెడ్డి ఎంపీడీవో సింగయ్య మండల ఉపాధ్యక్షులు వైసిపి సీనియర్ నాయకులు దువ్వూరు గోపాల్ రెడ్డి మండల ఏ కోళ్లు సర్పంచ్ ఆవుల బ్లెస్సి మండల నాయకులు మునస్వామి నాయుడు గోపిరెడ్డి మధుసూదన్ రెడ్డి భాస్కర్ రెడ్డి సురేష్ రెడ్డి పంచాయతీ సెక్రెటరీ రామయ్య సచివాలయం సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post a Comment