దేశం నలుమూలల నుంచి బారాషహీద్ దర్గాకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రొట్టెల పండుగను




 నెల్లూరు, తేది.14.7.2023

దేశం నలుమూలల నుంచి బారాషహీద్ దర్గాకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రొట్టెల పండుగను విజయవంతం చేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. 

 ఈనెల 29 నుంచి జరగనున్న రొట్టెల పండగ ఏర్పాట్ల పై  శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ విసి హాలులో జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణన్, ఎస్పీ శ్రీ తిరుమలేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీ వికాస్ తో కలిసి ఎంపీ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 

 ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి దర్గా వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని, వీఐపీ పాసులను ముందుగానే ఎక్కువగా ముద్రించి ఉంచుకోవాలని, వర్షం వస్తే ఇబ్బంది లేకుండా దర్గా సమీపంలోని కళ్యాణ మండపాలను ముందుగా సిద్ధం చేసుకోవాలని, అల్లరిమూకల నుంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. 

జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణన్ మాట్లాడుతూ అధికారులందరూ వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.  ఏ ఏ శాఖలు ఏ ఏ పనులు చేపడుతున్నారో వివరంగా అడిగి తెలుసుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. పోలీసు యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయం చాలా ముఖ్యమని, ఈ రెండు శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్కింగ్, దారి మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాలు మొదలైన ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తూ పత్రికల్లో ప్రకటనలు ముందుగానే జారీ చేయాలన్నారు.

ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భక్తుల దర్శనానికి ఇబ్బందులు లేకుండా, విఐపి లకు ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తూ, నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. స్వర్ణాల ఘాట్ వద్ద, క్యూలైన్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు స్పష్టంగా అర్థం అయ్యేలా దర్గా ప్రాంగణంలో హోర్డింగులు, మ్యాపులు పెడుతున్నట్లు చెప్పారు. చెరువు వద్ద ఈతగాళ్లు, బోట్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. రాత్రింబవళ్లు సీసీ కెమెరాలు పనిచేసేలా, నిరంతరం విద్యుత్ ఉండేలా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వికాస్, డిఆర్వో వెంకటనారాయణమ్మ, అడిషనల్ ఎస్పీ హిమవతి, ఆర్డిఓ మలోల, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నిర్మలా దేవి తదితర జిల్లా అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget