స్పందన వినతులకు నాణ్యమైన పరిష్కారాలు అందించండి
- కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.యస్.,
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారాలు అందించాలని, సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. కార్యాలయంలోని ఎ.పి.జె అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన వేదికలో కమిషనర్ పాల్గొని "డయల్ యువర్ కమిషనర్" కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను నేరుగా మాట్లాడారు. వివిధ సమస్యలపై వచ్చిన 14 ఫిర్యాదులను కమిషనర్ సంబంధిత విభాగం అధికారులకు తెలియజేసి సూచించిన గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు.
అనంతరం ప్రజలనుంచి నేరుగా 32 అర్జీలను కమిషనర్ స్వీకరించారు. అందుకున్న సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని ఆదేశించారు.
జగనన్నకు చెపుదాం 1902, స్పందన, Yet To View, ఎ.పి సేవా పోర్టల్ లను నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రతిరోజూ పరిశీలించుకోవాలని, ఫిర్యాదులు పెండింగులో లేకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
మంచినీటి కుళాయి టాక్స్ కు సంబంధించిన సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఇంజనీరింగ్ విభాగం ద్వారా సమగ్ర రిపోర్టును మున్సిపల్ ఉన్నతాధికారులకు పంపించనున్నామని కమిషనర్ తెలిపారు.
జగనన్న సురక్ష పధకం ద్వారా అర్హులందరికీ సంక్షేమాన్ని అందించేందుకు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల కార్యదర్శులను సమన్వయం చేసుకుని సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ సూచించారు.
స్పందన సమస్యల పరిష్కారం తీరును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలు అర్జీదారునితో నేరుగా విచారణ చేస్తున్నాయని, నగర పాలక సంస్థ సంబంధిత విభాగం అధికారి, సచివాలయ కార్యదర్శి ఫిర్యాదుదారుని కలిసి శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు. స్పందన సమస్యలు పునరావృతం కాకుండా అధికారులంతా కృషి చేయాలని కమిషనర్ సూచించారు.
స్పందన వేదికలో అందించే ఫిర్యాదుల సంఖ్యను తగ్గించేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు తమ విభాగాల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకోవాలని కమిషనర్ సూచించారు. విభాగాల ఉన్నతాధికారులు వారంలో తమకు కేటాయించిన 4 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించాలని, నోటీసు బోర్డుల ద్వారా సమాచారం ప్రజలకు అందేలా పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
స్పందన వేదికలో అందుకున్న అన్ని సమస్యలకు పారదర్శకమైన పరిష్కారాన్ని, సూచించిన గడువులోపు అందించేందుకు అన్ని విభాగాల అధికారులు కృషి చేయాలని కమిషనర్ కోరారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.
Post a Comment