బిపి-షుగర్,వ్యాధిగ్రస్తులకు నెలసరి సరిపడా మందులు పంపిణీ
రవికిరణాలుప్రతినిధి -దొరవారిసత్రం :-
అంటూ రహిత వ్యాధులైనమధుమేహం, రక్తపోటు వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి వ్యాధి యొక్క మోతాదును గుర్తించి నెలకు సరిపడా మందులను వైద్య సిబ్బంది అందించారు. దొరవారి సత్రం మండలంలోని వెదురుపట్టు గ్రామపంచాయతీలో గల తుంగమడుగు గ్రామంలో సోమవారం విలేజ్ డాక్టర్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామంలోని పాత రోగులైన షుగర్ బిపి వారికి పరీక్షలు చేపట్టి, మందులు పంపిణీ చేసి, ఆరోగ్య సూత్రాల్లో భాగంగా దినసరి వ్యాయామం ( నడక) గ్లూకోస్ మోతాదు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని వారికి సూచించారు. రెగ్యులర్గా మందులు వాడకం, ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలియజేశారు. ప్రతి నెలలో ప్రభుత్వం నుండి ఉచిత మందులు పొందడంతో మాకు కొంత ఆర్థిక భారం తగ్గుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా చిరు వ్యాధులకు చికిత్స, నీటి సంబంధం, దోమల ద్వారా సంభవించే వ్యాధులపై కూడా అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్గోపి కిరణ్,సచివాలయ ఏ ఎన్ ఎం, హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, ఆశ కార్యకర్తలుహాజరయ్యారు.
Post a Comment