కోట లో శరవేగంగా సిసి రోడ్ల నిర్మాణం రవి కిరణాలు ప్రతినిధి కోట
కోట అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్స్ నిర్మాణము శరవేగంగా జరుగుతుంది. రోడ్ల నిర్మాణంలో భాగంగా కోట గాంధీ బొమ్మ వరకు దాదాపు 400 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సీసీ రోడ్లతోపాటు డ్రైనేజ్ కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు సీసీ రోడ్డుకు సమాంతరంగా పూర్తి చేశారు. తదనంతరం కోట గాంధీ బొమ్మ నుంచి నూతన సచివాలయం వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కోట అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ నిర్మాణానికి, సీసీ రోడ్ల నిర్మాణానికి, ఆక్రమణ తొలగింపకు ప్రజలు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి చరవాణి ద్వారా పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో
కోట పట్టణం సర్వాంగ సుందరంగా తయారవుతుందని పేర్కొన్నారు.
Post a Comment