జగనన్న సురక్ష లభ్యదారులకు శ్రీరామరక్ష
ఎంపీపీ, కోళివి రెడ్డి, ఎంపీడీవో అమోస్ బాబు,
ఎమ్మెల్యే సంజీవయ్య సహకారంతో పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాము
వైసిపి నేత తిరుమూరు రవి రెడ్డి
కొండూరు పంచాయతీ జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలి గ్రామస్తులు వినతి
రవి కిరణాలు తిరుపతి జిల్లా తడ:-
అర్హుల సంక్షేమమే జగనన్న సురక్ష దేయమని ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అని ప్రతి గడపకు వెళ్లి సర్వే నిర్వహించి జగనన్న సురక్ష పథకం ద్వారా లబ్ధిదారులు గుర్తించి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తడ మండల ఎంపీపీ కొళివి రఘు రెడ్డి అన్నారు శనివారం తడ మండల పరిధిలోని కొండూరు పంచాయతీలో పంచాయతీ సర్పంచ్ వాటంబేటి శ్రీలక్ష్మి అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ, ఎంపీడీవో పాల్గొన్నారు. తడ మండలం ఎంపీడీవో అమోస్ బాబు మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి జూలై 30వ తేదీ వరకు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రతి సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్నామని లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని మునుపటి క్రితం ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే మండలానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడేదని ప్రస్తుతం గ్రామ సచివాలయం పరిధిలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిప్యూటీ తాసిల్దార్ శరత్ బాబు మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భూములు రీ సర్వే నిర్వహిస్తున్నామని అదేవిధంగా 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని తెలిపారు. మండల వైసీపీ నాయకులు తిరుమూరు రవి రెడ్డి మాట్లాడుతూ సూళ్లూరుపేట శాసనసభ్యులు సంజీవయ్య సహకారంతో కొండూరు పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీసీ రోడ్లు, మంచినీటి కోసం పైపులైన్లు, సచివాలయం భవనం నిర్మాణం, రైతుల కోసం ఎన్నో ఏళ్లగా పెండింగ్ లో ఉన్న పొర్లు కట్ట పనులు పూర్తి చేయగలిగామని ఎమ్మెల్యే సంజీవయ్య కొండూరు పంచాయతీ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిదులు మంజూరు చేశారని ఆయన తెలిపారు.ఎ పి ఎమ్ రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేస్తుందని అదేవిధంగా ఫుడ్ ప్రాసెస్ యూనిట్ నిర్వహించేందుకు ప్రత్యేక రాయితీలతో మహిళలకు రుణాలు మంజూరు చేస్తుందని ఆహార పదార్థాలను ముడి సరుకులతో తయారుచేసి విక్రయించేందుకు మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేస్తామని ఆసక్తి గలవారు సంప్రదించాలని తెలిపారు. కొండూరు పంచాయతీ జగనన్న కాలనీలో నిర్మాణాలు చేపట్టేందుకు విద్యుత్ స్తంభాలు విద్యుత్ లైన్లు, అడ్డంగా ఉన్నాయని ఈ సమస్యను పరిష్కరిస్తే నిర్మాణాలు చేపడుతామని లబ్ధిదారులు ఎంపీడీవో అమోస్ బాబు ను కోరగా వెంటనే స్పందించి సంబంధిత అధికారులు తెలియజేసి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని జగనన్న సురక్ష కార్యక్రమంలో మండల ఎంపీడీవో లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుణపాటి జయంతి, ఉప సర్పంచ్ రాణమ్మ, వెంకటయ్య, చంద్రయ్య,పంచాయతీ కార్యదర్శి జయచంద్ర, విఆర్ఓ చలపతి, సచివాలయం సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు
Post a Comment