రేషన్ పరేషాన్-పనిచేయని సర్వర్లతో అగచాట్లు.
పేదలకు సకాలంలో అందని రేషన్ బియ్యం.
రవి కిరణాలు ప్రతినిధి చిట్టమూరు జూలై 11
ప్రజా పంపిణీ ద్వారా పేదలకు అందుతున్న నిత్యావసర వస్తువులు సక్రమంగా,సమయానికి అందడం లేదు.దీంతో పేదలు,సామ్యాన్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.రేషన్ పై ఆధారపడ్డ కుటుంబాలు మార్కెట్లో ఎక్కువ ధరకు బియ్యం కొనాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం తీసుకువచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నూతన విధానాలతో సకాలంలో నిత్యావసర వస్తువులందక కార్డుదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.రేషన్ పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు ఇప్పటివరకు ఒక్కసారి వేలిముద్రలు వేస్తే సరిపోయేది. ప్రస్తుతం రెండుసార్లు వేలిముద్రలు తప్పనిసరి చేశారు. మరోవైపు ఈపాస్ యంత్రాలు మొరాయించడం,సర్వర్ల సమస్యతో ఎండియు ఆపరేటర్ లు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీంతో ఒక్కోక్క వినియోగదారునికి అరగంటకు పైగా సమయం వెచ్చించాల్సి పరిస్థితులు నెలకొనడంతో కార్డుదారులు, ఎండియులు అవస్థలు పడుతున్నారు.ఒక్కో ఆపరేటర్ పరిధిలో గతంలో రోజుకు 200 మందికి పంపిణీ చేస్తుండగా,ప్రస్తుతం 50 మందికి కూడా పంపిణీ చేసే పరిస్థితి లేదంటున్నారు.ఒక్కో ఎండియు ఆపరేటర్ పరిధిలోని లబ్ధిదారులకు 15వ తేదీ లోపు బియ్యం మొత్తం పంపిణీ చేస్తుండగా,ప్రస్తుతం సగం నెల గడిచినా 20శాతం కూడా పూర్తి కాకపోవడంతో ఎండియులు విమర్శలెదుర్కోంటున్నట్లు వాపోయారు.కార్డుదారుల్లో ఆందోళనా నెలకొంది.ప్రభుత్వ నూతన విధానాలను సవరించి,సర్వర్ల సమస్య తలెత్తకుండా, సకాలంలో నిత్యవసర వస్తువులు అందేలా చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
Post a Comment