ప్రతి నెలలో వైద్య పరీక్షలుచేయించుకోవాలి
రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం న్యూస్ :-
గర్భ నిర్ధారణ జరిగినప్పటి నుండి ప్రసవం వరకు ప్రతి నెలలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ చైతన్య సూచించారు. సోమవారం దొరవారిసత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడకు హాజరైన ప్రతి గర్భవతినిపరీక్షించి, బరువు పెరగని గర్భిణీ, రక్తహీనత గల వారిని, రక్తపోటులో తేడాలు ఉన్నటువంటి వారికి ఆరోగ్య సలహాలు, సూచనలు చేశారు. ప్రధానంగా బిడ్డ పెరుగుదలకు, సులభతరమైన కాన్పు కోసం మంచి పోషకాహార విలువలు కలిగిన పదార్థాలను ప్రతిరోజు తీసుకోవాలని, రక్తహీనతను నివారించే ఐరన్ కలిగిన పచ్చని ఆకుకూరలు ఆహారంలో సేవించాలని తెలియజేశారు. ప్రతి నెలలో 9వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి హాజరై ఆరోగ్య సేవలు, పలు రకాల రక్త పరీక్షలు చేయించుకోవాలనితెలిపారు. అంతేకాకుండా డాక్టర్. పలనిరాజ్ మరికొందరి గర్భిణీలను పరీక్షించి పలు సూచనలు ఇచ్చారు. ప్రతి గర్భవతి ఈ కార్యక్రమానికి హాజరయ్యేట్లు చూడాలని ఏ ఎన్ ఎం, ఆశా కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సి హెచ్ ఓ, సంపూర్ణమ్మ, పి హెచ్ ఎన్ పద్మావతి, సూపర్వైజర్స్ మైథిలి, కిరణ్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు హాజరయ్యారు.
Post a Comment