ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
వెంకటగిరి,తిరుపతి జిల్లా, జూలై17: ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నుండి 2023-24 సం. కు గాను రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు వరుసగా ఐదవసారి వైఎస్ఆర్ నేతన్న నేస్తం నగదును కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేయనున్న నేపథ్యంలో సిఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె వెంకట రమణ రెడ్డి గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించి సిఎం పర్యటనకు ఏర్పాట్లు సకాలంలో పగద్భందీగ పూర్తి చేయాలని అన్నారు.
సోమవారం సాయంత్రం ఈ నెల 21 న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించ నున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ పర్యటించి పలు సూచనలు చేశారు. గౌ ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే వాహనాల పార్కింగ్ కొరకు ఊరి బయట ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం పబ్లిక్ మీటింగ్ ప్రదేశాన్ని పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహణ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశ్వోదయ గ్రౌండ్ హెలిప్యాడ్ ఏర్పాట్లు పరిశీలించి లైన్ అప్, బ్యారికాడింగ్ తదితర ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.
అనంతరం తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాష్ట్ర కమ్యూనిటీ బోర్డు చైర్మన్ రాంకుమార్ వారితో కలిసి ఇరిగేషన్ శాఖ అతిథి గృహంలో ఏర్పాట్లపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఎస్డిసి లు శ్రీనివాసులు, తాశిల్డార్ పద్మావతి, ఎంపిడిఓ విజయలక్ష్మి, మునిసిపల్ కమీషనర్ వెంకటరామయ్య , ఇరిగేషన్ సి ఇ వెంకట రమణ, ఈ ఈ రాధా కృష్ణ, ఆర్ అండ్ బి అధికారులు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post a Comment