ఉత్కంఠకు తెరలేపిన రాపూరు మండల ప్రజా పరిషత్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. చెన్ను వర్సెస్ నేదురుమల్లి వర్గాలు తమకంటే,తమకంటూ ఎంపీపీ పదవీ కోసం తీవ్రంగా పోటీ నెలకొనడంతో పార్టీ అధిస్తాం జోక్యం తో చెన్ను వర్గానికి చెందిన కుమ్మరిగుంట ప్రసన్నాను ఎంపీపీ గా 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవమైన ప్రసన్నకు ఎన్నికల అధికారి ప్రసన్న కు డిక్లరేషన్ అందజేశారు.అనంతరం నూతన ఎంపీపీ ప్రసన్నను వెంకటగిరి నియోజవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి,ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్, పాపకన్ను మధుసూదన్ రెడ్డి,చెన్ను తిరుపాల్ రెడ్డి అభినందించారు. నేదురుమల్లి రామకుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిస్తాం అదేశాను సారం కుమ్మరిగుంట ప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.అందరూ కలసికట్టుగా పని చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు.ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్ మాట్లాడుతూ మంచి మనస్సున్న వ్యక్తి ముఖ్యమంత్రి గా పాలన సాగిస్తున్నారు కాబట్టే మనకు ప్రకృతి సహకరిస్తుందన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 90 శాతం పై చిలుక అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిడేనన్నారు.
Post a Comment