ఆసుపత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలి
ఎంపీపీ దువ్వూరు సుజాతమ్మ
రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం న్యూస్:- ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు వైద్యం అందించాలని ఎంపీపీ దువ్వూరు సుజాతమ్మ అన్నారు ఆమె శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించడమే కాదు ఎవరు పనులు వారు చక్కగా నిర్వహించి రోగులకు మంచి వైద్యాన్ని అందించాలి ఎవరైనా సరే సమయపాలన పాటించక పోయిన ఎవరు పనులు వారు చేయకపోయినా అట్టివారిపై ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకుంటున్నది అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధి కొరకు 1.75 లక్ష రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగినది ఈ నిధులుతో ఆసుపత్రికి రోగులకు అవసరమైన పరికరాలు అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆమె అన్నారు డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ఈ నిధులతో రోగుల సౌకర్యార్థం కొరకు ఆర్ ఓ వాటర్ ప్లాంట్ బెడ్లపై దుప్పట్లు లాంటి కల్పించడం జరుగుతుందని తెలిపారు ఎంపీడీవో సింగయ్య మాట్లాడుతూ సిబ్బందికి యూనిఫామ్ ఉన్న వారు ధరించడం లేదు దీనివలన స్టాప్ ఎవరు రోగులు ఎవరు అని తెలియడం లేదు రోగులు కూడా స్టాప్ ఎవరని గుర్తుపట్టలేకపోతున్నారు ప్రతి ఒక్కరూ యూనిఫామ్ ధరించాలని తెలిపారు అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ ని కంప్యూటర్ రూమ్ గా ఎలా వాడుతున్నారని ఎంపీడీవో సిబ్బందిని ప్రశ్నించారు మండల ఉపాధ్యక్షులు దువ్వూరు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తెస్తూ మంచి వైద్యాన్ని అందిస్తూ ఆసుపత్రిని అభివృద్ధి పరచాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పళణి రాజు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు
Post a Comment