మ్యుటేషన్ కు సంబంధించిన దరఖాస్తులను గడువులోపు పరిష్కారం చూపాలి
జగనన్న కు చెబుదాం స్పందన అర్జీల ఎండార్స్మెంట్ లో నాణ్యత ఉండాలి : జాయింట్ కలెక్టర్
రవి కిరణాలు, తిరుపతి, జూన్ 2 :-
మ్యుటేషన్ కు సంబంధించిన దరఖాస్తులను ఆలస్యం లేకుండా గడువులోపు పరిష్కారం చూపేల దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కన్ఫెరెన్స్ హాల్ నుండి ఆర్.డి.ఓ. లు, తహశీల్దార్లు, సర్వేయర్లు, వి ఆర్ ఓ లతో రీసర్వే, విలేజ్ సర్వేర్ ల డేటా ఎంట్రీ, జగనన్న కు చెబుదాం, మ్యూటేషన్, అసైన్ మెంట్ ల్యాండ్స్, కోర్టు కేసెస్ తదితర అంశాలపై వీడియో కన్ఫెరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత అంశం కాబట్టి అర్జీలను సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపేలా ఉండాలని తెలిపారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్నటు వంటి మ్యుటేషన్ సంబంధించిన దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని అన్నారు. గ్రామాలలో విలేజ్ సర్వేల డేటా , ఎంట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా సదా బైనామ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలన్నారు. అసైన్మెంట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్స్, కోర్టు కేసెస్ కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకుని రావాలి సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ కోదండరామి రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఏ.డి. సర్వేయర్ జయరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment