ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల అత్యవసర మరమ్మత్తులకు అవసరమయ్యే నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పరిశ్రమల యాజమాన్యాలు సహకారం అందించాలి: కలెక్టర్
రవి కిరణాలు,
తిరుపతి, జూన్19: -
జిల్లాలో మరమ్మత్తులు అవసరమైన సుమారు 100 సంక్షేమ వసతి గృహాలను గుర్తించగా వాటిలో రూఫ్ లీకేజీ, డ్రైనేజీ తదితర అత్యవసర మరమ్మతులు అవసరమైనటువంటి ప్రాధాన్యతగా గుర్తించబడిన 17 ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లలో ప్రభుత్వం అందజేస్తున్న సాయంకు అదనంగా హాస్టళ్ల మరమ్మత్తులకు అవసరమయ్యే నిధులను జిల్లాలోని పరిశ్రమల ప్రతినిధులు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా సహాయం చేయాలని దీనికొరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్ నందు సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు చెందిన సంక్షేమ వసతి గృహాలలో అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన మరమ్మతులు అవసరమయ్యే హాస్టళ్లకు నిధులను సమీకరించే దిశలో పరిశ్రమల శాఖ, ఫ్యాక్టరీల శాఖ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో జిల్లా ఎస్సీ, బీసీ వెల్ఫేర్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో అత్యవసర మరమ్మత్తులు కలిగిన 13 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మరియు 4 వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్లలో మరమ్మతులు చేపట్టడానికి సుమారు 86 లక్షల పైన అవుతుందని, ఈ నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద జిల్లాలోని పలు పరిశ్రమల యాజమాన్యాలతో సంబంధిత అధికారులు సంప్రదించి సమీకరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు కాంపౌండ్ వాల్ లేదా ఫెన్సింగ్ ఏర్పాటుకు ఎస్టిమేట్లు తయారుచేసి తెలపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా జిల్లాలోని పలు పరిశ్రమలు ఇతర ఏజెన్సీలు సమాజానికి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల అమలుకు జిల్లా యంత్రాంగానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మరియు సాధికార అధికారి చెన్నయ్య వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార అధికారి భాస్కర్ రెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి నరేంద్రబాబు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Post a Comment