ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి ఏ డి ఏ అనిత.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
రైతులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూళ్లూరుపేట వ్యవసాయ అధికారి డి.అనిత కోరారు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు ప్రధానంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సబ్ డివిజన్ పరిధిలోని సూళ్లూరుపేట తడ దొరవారిసత్రం మండలాల్లో ఉన్న రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు వరి పంటను సుమారు 100 హెక్టార్లు వరి సాగు చేస్తారని 100 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తారని అన్నారు వ్యవసాయమే ప్రధానంగా ఉన్న ఈ డివిజన్ పరిధిలో వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహకారాలు అందజేస్తున్నారని అన్నారు. ప్రతి రైతుకు రైతు భరోసా కేంద్రం వద్ద ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులు అన్నిచోట్ల మట్టి నమూనాలు సేకరించి ఆ మట్టి నమూనాలను ప్రభుత్వానికి పంపించి వాటిని పరిశీలించి అక్కడ ఎలాంటి పంట వేయాలో రైతులకు సూచించే విధంగా గ్రామ సహాయకులు తోడ్పడతారని అన్నారు. శుక్రవారం నుండి గ్రామ సహాయకులు రైతుల వద్దకు వెళ్లి మట్టి నమూనా సేకరించే పనిలో ఉన్నారని అందుకు రైతులు సహకరిస్తున్నారని రైతులు నేల స్వభావం ఎలా ఉందని అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. పంటలు వేసేటప్పుడు ఎలాంటి ఎరువులు వేసుకోవాలి అవసరమైనప్పుడు ఈ గ్రామ సహాయకులు రైతు భరోసా కేంద్రం వద్దకు వెళితే ఎలాంటి విలువలు వేయాలని సూచనలు చేస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ రైతు భరోసా గత ఐదు సంవత్సరాల నుండి ప్రవేశపెట్టిన అప్పటినుండి ఇప్పటివరకు రైతులకు రైతు భరోసా అందిస్తుందని అన్నారు. ఈ సంవత్సరం కూడా రైతు భరోసా కింద 16,000 మంది రైతులకు రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని వారిలో 1100 మంది రైతులకు వారి ఆధార నంబరు బ్యాంక్ అకౌంట్ కి లింక్ అవ్వకపోవడంతో వారికి చెమ కాలేదని అన్నారు ఆ నగదును రైతు ఖాతాలో జమ అయ్యేందుకు మా వ్యవసాయ శాఖ సహాయక సిబ్బంది ఆర్బీకే లతో రైతు కు ఫోన్లతో సమాచారం అందించి భరోసా కేంద్రాల వద్ద జమ కాన్ని రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి నగదు ఏవిధంగా చేసుకోవాలో సూచనలిస్తున్నారని అన్నారు. రైతులకు వారి ఖాతాలో నగదు జమ కావాలంటే ప్రధానంగా మూడు సూచనలు పాటించాలని వాటిలో మొదటిగా రైతు తన పొలాన్ని మీ భూమిలో నుండి బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేయించుకోవడం అక్కడి నుండి ఆధార్ కార్డు లింక్ చేయించుకోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చే పథకాలు నేరుగా వారి అకౌంట్లోకి జమ అవుతుందని అన్నారు. రైతుల కొరకు మంగళవారం ప్రత్యేక గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని ఆ గ్రీవెన్స్కు మూడు మండలాల్లో ఉన్నటువంటి రైతులు విచ్చేసి వారి యొక్క సమస్యలను తెలిపినట్లైతే వెంటనే వాటిని పరిష్కరించే విధంగా చేపడతామని అన్నారు.
Post a Comment