SPS నెల్లూరు జిల్లా
మిస్సింగ్ కేసులలో ఎటువంటి జాప్యం చేయరాదు- జిల్లా యస్.పి. శ్రీ డా.కె. తిరుమలేశ్వర రెడ్డి,IPS., గారు
జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి స్టేషన్ లో ఉన్న మిస్సింగ్, లోక్ అధాలత్, ఎర్రచందనం కేసులపై, ఓరల్ ఎంక్వయిరీ పెండింగ్ లపై సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేసి, సర్కిల్ స్థాయిలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేయాలని ఆదేశించిన జిల్లా యస్.పి. గారు. మహిళలు, బాలికలు, వృద్దులు తప్పిపోయిన కేసులలో వెంటనే ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలి. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదు.
పాత మిస్సింగ్ UI కేసులు, మహిళా మిస్సింగ్ కేసులపై తక్షణమే స్పందించాలి..
ప్రతి మిస్సింగ్ కేసును పలుకోణాలలో అలోచించి, కీలక ఆధారంతో ముందుకెళ్ళండి..
మిస్సింగ్ కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం AHTU తో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు..
ట్రేసింగ్ లో సైబర్, I.T Core టీమ్ సిబ్బంది సహకారంతో CCTNS, ICJS, ITSSO మొదలైన సాంకేతికత ఆధారంగా శోధించండి..
ప్రత్యేక బృందాలను రంగంలోకిదించి సీసీ కెమెరాల లలో దొరికిన ఆధారాలతో అంతరాష్ట్రాలకు పంపి, జల్లెడ పట్టండి..
తప్పిపోయిన మహిళలు, బాలికలు, వృద్దుల ఆచూకీకై త్వరితగతిన ఛేదించుటకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో డ్రైవ్ ద్వారా ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశాలు. పిల్లలు, మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక చొరవ తీసుకుని వారి కుటుంబాల్లో తిరిగి ఆనందాన్ని నింపాలని ఆదేశాలు. పిల్లల యొక్క ప్రవర్తన, నడవడికను తల్లిదండ్రులు అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలని సూచన. ప్రజలు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని, ఆపద సమయాలలో పోలీసు సేవలు వినియోగిచుకోవాలని సూచన. జిల్లాలో ఎటువంటి అసాంఘీక కార్యకలాపాలు జరిగుతున్నా పోలీసుశాఖకు సమాచారమిచ్చి సహకరించాలని విజ్ఞప్తి. ట్రేసింగ్ లో కీలక పాత్ర పోషించిన వారికి రివార్డులు అందించడం జరుగుతుంది.. వారంలోపు పురోగతి చూపాలని ఆదేశాలు..
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.17.06.2023.