వాలంటీర్లను ఘనంగా సన్మానించిన MLA వెలగపల్లి...
చిట్టమూరు రావి కిరణాలు: మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో గల వాలంటీర్లను గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయంలోని స్త్రీ శక్తి భవనం నందు గురువారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ మండల పరిధిలో 239 మంది వాలంటీర్లు కలరని వాలంటీర్ పరిధిలో గల ప్రతి 50 కుటుంబాలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి నెల 1వ తారీకు ఉదయం ఆరు గంటలకే ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను వితంతువులు, వృద్ధులకు,వికలాంగులకు అందజేయడం జరుగుతుందని, అంతేకాక వాలంటీర్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం నుండి అందుతున్న ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు చేరువ చేయడం జరుగుతుందని,వీరి సేవలను గుర్తించి ప్రభుత్వం ప్రతి వాలంటీర్ కి పదివేల రూపాయలు నగదు అందజేయడం జరుగుతుందని వారికి ప్రశంసా పత్రం అందజేసి వారి సేవలకు గుర్తింపుగా సన్మానించడం జరిగిందని వర ప్రసాద్ తెలిపారు. అలాగే చిట్టమూరు మండలం నుండి ఐదు మంది వాలంటీర్లను ఉత్తమ వాలంటరీగా ప్రభుత్వం గుర్తించిందని వారికి ఒక్కొక్కరికి 20000 రూపాయలు నగదు ప్రశంసా పత్రం అందజేయడం జరిగిందని, వరప్రసాద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ శ్రీనివాసులు ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీనివాసులు మండల ఉపాధ్యక్షులు బద్దిగా వెంకట రమణయ్య,మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, మండల జడ్పిటిసి చిప్పల గవెంకటయ్య,జిల్లా వ్యవసాయ సలహా మండల సభ్యులు దువ్వూరు శేఘరెడ్డి పలువురు ఎంపీటీసీలు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post a Comment