SPS నెల్లూరు జిల్లా
'స్పందన' కార్యక్రమంను నిర్వహించిన జిల్లా యస్.పి. శ్రీ డా.కె. తిరుమలేశ్వర రెడ్ది,IPS., గారు
జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమం నిర్వహించిన జిల్లా యస్.పి. గారు. 94 ఫిర్యాదులు స్వీకరణ, సుదూర ప్రాంతాల ఫిర్యాదుదారులు అందరికీ భోజనాలు, మజ్జిగ అందించిన జిల్లా యస్.పి. గారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించండి. ఓర్పుతో వారి సమస్యలు విని, పరిష్కార దిశగా చర్యలు తీసుకోండి. చట్టపరిధిలోని సాధ్యాసాధ్యాలను వివరించండి. తప్పుడు పత్రాలు సృష్టించి మోసం చేసే ఫిర్యాదులలో, డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా పరిశీలించి, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, రవాణా సంబంధిత శాఖల అధికారుల దృవీకరణ పొంది, సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. వృద్దాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు పిల్లల భాద్యత.. ఆస్థి కోసం వారిపైనే దాడి చేసే ఫిర్యాదుల విషయంలో ఊదాసీనత చూపరాదు. సీనియర్ సిటిజన్స్ హక్కులను పరిరక్షించి భద్రత కల్పించండి. వరకట్న, అనుమానాస్పద మరణాలు వంటి తీవ్రమైన కేసుల దర్యాప్తులను లోతుగా పరిశీలించి విశ్లేషణాత్మక మూలకారణాలు వెలికితీసి చర్యలు తీసుకోవాలి.. అలసత్వం ప్రదర్శించరాదు. అదనపు కట్నం, చెడువ్యసనాలకు బానిసైన కుటుంబాల వివాద ఫిర్యాదులలో సత్వరమే స్పందించాలని, పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని కౌన్సెలింగ్ ద్వారా కుటుంబాలను చక్కదిద్దాలని ఆదేశాలు. దొంగతనం కేసులను చేధించి చోరీసొత్తును సంబంధిత కోర్టు ద్వారా భాదితులకు అప్పగించండి. మిస్సింగ్ కేసులలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించడం లేదా వారితో మాట్లాడించి ఉపశమనం కల్పించండి. స్పందన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబందిత అధికారులతో మాట్లాడి, త్వరితగతిన పరిష్కరించి భాధితులకు న్యాయం చేసేలా ఆదేశాలు జారీ.. స్పందనలో భూ, ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, తల్లిదండ్రులను పిల్లల వేధింపులు, నమోదైన కేసులలో పురోగతి, ఉద్యోగాల పేరుతొ మోసం, ప్రేమ పేరుతో మోసం, కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, ఆన్ లైన్ సైబర్ మోసాలు, ఇతర వివాదాలు మరియు సమస్యల ఫిర్యాదులు స్వీకరణ. ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్), SC/ST సెల్-2 DSP, నెల్లూరు రూరల్ DSP, AR DSP గార్లు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.22.05.2023.
Post a Comment